మాస్ ప్రకటన కార్డుల ప్రింటింగ్: గ్యాంగ్ అరెస్ట్

- August 23, 2021 , by Maagulf
మాస్ ప్రకటన కార్డుల ప్రింటింగ్: గ్యాంగ్ అరెస్ట్

అబుధాబి: అబుధాబిలో మూడు ప్రింటింగ్ ప్రెస్‌లు నిబంధనలకు విరుద్ధంగా మసాజ్ కార్డుల్ని ప్రింట్ చేయడంపై అధికారులు కన్నెర్రచేశారు. ఆసియా జాతీయులు ముఠాగా ఏర్పడి ఈ ప్రింటింగ్ ప్రెస్‌లను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ కార్డుల్ని అబుదాబి మరియు అల్ అయిన్ ప్రాంతాల్లో పంచుతున్నట్టు గుర్తించారు. ఈ కార్డుల ద్వారా రెసిడెంట్స్‌ని నిందితుల ముఠా ఆకర్షిస్తుంది. ఈ నేర పూరిత చర్యకు సంబంధించి సమాచారం అందడంతో అబుధాబి పోలీస్ ముఠా గుట్టు రట్టు చేసింది. ఇలాంటి అనుమానిత కార్యకలాపాలపై 8002626 నెంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని అబుధాబి పోలీస్ - క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ సుహైల్ అల్ రషీదీ సూచించారు.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com