ఒమన్‌లో ఫార్ములా వన్ ఫీవర్
- March 14, 2016
మస్కట్ ఐకానిక్ ముట్రాహ్ కోర్నిచ్ రేస్ ట్రాక్ సందడి చేయనుంది. పార్ములా వన్ గ్లామర్, హై ఓల్టేజ్ యాక్షన్ ఒమన్‌లో ఔత్సాహికుల్ని అలరించనుంది. ఎఫ్1 షో రన్ ఏప్రిల్ 8న ఒమన్‌లో జరగనుంది. 20,000 మంది అభిమానుల్ని అలరించనున్న ఈ ఫార్ములా వన్ రేసింగ్‌ని రెడ్ బుల్ తీసుకొస్తోంది. కేవలం 2.4 సెకెన్లలోనే సున్నా నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న హై స్పీడ్ హై పవర్ రేస్ కార్లు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి. ఏప్రిల్ 8కి కొద్ది రోజుల ముందునుంచే ఫార్ములా వన్ సందడి ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో నెలకొంది. ఒమన్‌టెల్ హెడ్ క్వార్టర్‌లో ఏప్రిల్ 7న ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఒమన్‌టెల్ ఈ ఈవెంట్‌లో ప్రధాన భూమికను నిర్వహిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఒమన్, షాబిబా, ది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, ది రాయల్ ఒమన్ పోలీస్, ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్, ఖిమ్జి రామ్‌దాస్, హై ఎఫ్‌ఎం మరియు హలా ఎఫ్‌ఎం ఈ ఈవెంట్‌కి భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







