లింక్డ్ ఇన్‌లో న్యూ స్టాండర్డ్స్‌ని సెట్ చేసిన మొహమ్మద్
- March 14, 2016
వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, లింక్డ్ఇన్ ఇన్‌ప్లుయెన్సర్ పబ్లిషింగ్ ప్లాట్ఫామ్లో పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలకు తెరలేపింది. 'వై మినిస్టర్స్ ఫర్ హ్యాపీనెస్, టోలరెన్స్, యూత్ అండ్ ఫ్యూచర్' అనే అంశంపై ఆయన రాసిన ఓపెన్ లెటర్ 'మోస్ట్ ఎంగేజింగ్' పొలిటికల్ ప్రముఖులకు సంబంధించిన పోస్ట్ కేటగిరీలో టాప్ 3లో చోటు సంపాదించుకుంది. లింక్డ్ ఇన్ ఇన్ఫ్లూయెన్సర్ అనేది ఓ ప్రత్యేకమైన వేదిక. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రముఖులకు, ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలకు గుర్తింపుగా వారి భావాల్ని తెలియజేసేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసింది లింక్డ్ ఇన్. బారక్ ఒబామా, రిచార్డ్ బ్రాన్సన్, హిల్లరీ క్లింటన్, డేవిడ్ కామెరోన్, బిల్ గేట్స్, నరేంద్రమోడీ, ఆప్రా విన్ఫ్రే తదితరులు లింక్డ్ఇన్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ విభాగంలో ఉన్నారు. షేక్ మొహమ్మద్ ఓపెన్ లెటర్ని పోస్ట్ చేసిన 48 గంటల్లోనే 300,000 వ్యూస్ వచ్చినట్లు టాలెంట్ సొల్యూషన్స్ అధిపతి, లింక్డ్ఇన్ సౌత్ యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా బాధ్యతల్ని చూస్తున్న అలి మటర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







