ఈ-శ్రమ్ పోర్టల్ లాభాలివే..!
- August 28, 2021
న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ ఈ-శ్రమ్ పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. అయితే అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు తీసుకు వచ్చారు. గురువారం https://crida.in/e-shram-portal-registration-csc-login/ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. అయితే దీని ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్‌లో స్టోర్ చేయనున్నారు.
దీనిలో ప్రతీ కార్మికుడికి ఆధార్ నెంబర్ తరహాలో 12 నెంబర్ల యూనివర్స్ అకౌంట్ నెంబర్ (UAN) ఇవ్వనున్నారు. మొత్తం దేశంలో 380 మిలియన్ అసంఘటిత రంగ కార్మికుల డేటాను రికార్డ్ చేయడమా జరిగింది. మరి ఇక ఈ పోర్టల్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..
ఈ పోర్టల్ చాలా మందికి బెనిఫిట్ గా ఉంటుంది. అసంఘటిత రంగ కార్మికులు ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన (PMSYM), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) మరియు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇది ఇలా ఉంటే PMSYM, PMJJBY, PMSBY మరియు PM-JAY (ఆయుష్మాన్ భారత్) తో సహా సామాజిక భద్రత (పెన్షన్, భీమా) పథకాలు డేటాబేస్‌లో చేర్చబడుతాయి.
అలానే దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇచ్చారు. పోర్టల్ తో పాటుగా టోల్ ఫ్రీ నంబర్ 14434 కూడా ప్రారంభించబడుతుంది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద కుటుంబానికి రూ .5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుంది.PMSYM లో రూ. 3000 పెన్షన్ అందుబాటులో కూడా వుంది.
తాజా వార్తలు
- స్కూళ్లలో రమదాన్ సందడి: 5 గంటలకే పరిమితమైన క్లాసులు..
- హై అలర్ట్.. దేవాలయాలే టార్గెట్.. దాడులకు ఉగ్రవాదుల ప్లాన్
- కొడుకు ప్రాణం తీసిన డ్రైవర్‌ను క్షమించిన తల్లిదండ్రులు
- AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు
- భారత్ రానున్న పాప్ సంచలనం షకీరా
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్‌గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!









