బహ్రెయిన్‌లో 57 శాతం మందికి సినోఫామ్ వ్యాక్సిన్
- August 28, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19పై పోరులో భాగంగా 57 శాతం మంది పౌరులు, నివాసితులు సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు బహ్రెయిన్ అథారిటీస్ పేర్కొన్నాయి. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. మొత్తం 569,054 మంది సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా, బహ్రెయిన్‌లో మొత్తం 996,403 మంది రెండు డోసుల వ్యాక్సిన్లను డిసెంబర్ 9 నుంచి జులై 17 మధ్య తీసుకున్నారు. 19 శాతం జనాభా స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకోగా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం 17. మిగతా 7 శాతం మంది ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పొందనివారిలోనే 88 శాతం కోవిడ్ మరణాలు సంభవించాయి. సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 11.4 శాతం మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఫైజర్ మరియు స్పుత్నిక్ వ్యాక్సిన్స్ తీసుకున్నవారిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఆరు. ఆస్ట్రా జెనకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయింది ఒకే ఒక్కరు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







