కడుపు ఉబ్బరంను నయం చేసే ఔషదాలు
- March 14, 2016
సాధారణంగా మనకు ఇష్టమైన ఆహారం కాస్త ఎక్కువ తీసుకుంటే చాలు కడుపు నొప్పిరావడమో..ఉబ్బసంగా ఉండటమో జరుగుతుంది. ఇక ఆ సమయంలో మనం పడే అవస్థ అంతా ఇంతా కాదు. కడుపు ఉబ్బరం వల్ల ఉదరభాగం బిగదీసుకు పోయి పట్టేసినట్లు ఉండి, అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన, ఒళ్లు నొప్పులు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి వివిధ లక్షణాలు అన్నీ కాని, లేదా వీటిలో కొన్ని కాని ఉంటాయి.
ఇలాంటి సమయంలో చాలా మంది ఆయాస పడుతుంటారు..కూల్ డ్రింగ్ తాగాలని లేదా ఇతర గ్యాస్టిక్ మెడిసన్ వాడాలని సలహాలు ఇస్తుంటారు. కడుపు ఉబ్బరం అంటే కడుపులో ఎక్సెసీవ్ గ్యాస్, ఉడటం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. మలబద్దకం, ఎక్కువగా తినటం, చెడు ఆహారపు అలవాట్లు, మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు గాలి మింగడం, చీకాకు పెట్టే పేగు వ్యాధి లాంటివి రావచ్చు.
.అందుకే కాబట్టి మీరు తీసుకొనే డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
కడుపుబ్బరాన్ని నివారించే ఔషదాలు :
కడుపు ఉబ్బరంను నయం చేసే లక్షణాలు సోంపులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే భోజనం చేసిన వెంటనే సోంపు నములుతుంటారు కొందరు. ఇది ప్రేగులో గ్యాస్ ను మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి.
కొద్దిగా పుదీనా ఆకులను శుభ్రం చేసి, నీటిలో వేసి బాగా మరగ కాచి, ఆ నీటిని గోరువెచ్చగా భోజనం తర్వాత తాగాలి. ఇలా చేస్తుంటే బ్లోటింగ్ మరియు క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. నరాలను బలోపేతం చేసి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
యాసిడ్ రిఫ్లెక్షన్ కు అల్లం ఒక ఉత్తమ ఆహారం. అల్లంను యాంటీఇన్లమేటరీ మరియు జీర్ణకోశ వ్యాధులకు కొరకు పురాతన కాలం నుండి చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే జింజరాల్ మరియు షోగోల్స్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి .
కొన్ని కారవే సీడ్స్ ను నోట్లో వేసుకొని నమలడం ద్వారా ఉపశమనం కలుగుతుంది . చాలా త్వరగా తిన్న ఆహారం జీర్ణం అవుతుంది . కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ మార్గం.
డైలీ డైట్ లో గుమ్మడిని చేర్చుకోవడం వల్ల కడుపుబ్బరం నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు . కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ రిలీవ్ అవుతుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంది. అరటిపండ్లు మలబద్దానికి కారణమయ్యే గ్యాస్ మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి . కాబట్టి, అరటిపండ్లలో ఉండే పొటాషియం అనే మినిరల్స్ శరీరంలో ఫ్లూయిడ్ లెవల్స్ రెగ్యులేట్ చేస్తుంది. బ్లోటింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







