‘బుజ్జి ఇలా రా’ సినిమాలో సునీల్ లుక్ విడుదల
- August 29, 2021
హైదరాబాద్: నటుడు సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రధారులుగా ‘బుజ్జి ఇలా రా’ సినిమాలో నటిస్తున్నారు. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వంలో జి. నాగేశ్వర్‌రెడ్డి టీమ్ వర్క్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దీనికి ‘ఇట్స్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్.చాందిని అయ్యంగార్ హీరోయిన్ గా నటిస్తోంది. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి- జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి- సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సునీల్ పాత్రకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు. సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా, సునీల్ మొదటిసారి ముస్లిం పాత్రలో కనిపించిన తీరు ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత







