'బంగార్రాజు' ఫస్ట్ లుక్ విడుదల

- August 29, 2021 , by Maagulf
\'బంగార్రాజు\' ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్: అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రాల్లో ఒకటి 'బంగార్రాజు'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన చేసిన 'బంగార్రాజు' పాత్రని ప్రధానంగా చేసుకొని ఇప్పుడు ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ తనయుడు నాగ చైతన్య కూడా నటిస్తుండటం చిశేషం. 'సోగ్గాడే చిన్ని నాయనా' తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభం అయిన ఈ మూవీ నుంచి నేడు (ఆగస్ట్ 29) నాగార్జున బర్త్ డే సందర్భంగా, చైతూ ఫస్ట్ లుక్‌ను వదిలి తండ్రికి విషెస్ తెలిపారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com