ఆన్‌లైన్‌లో వివిధ వీసా బదిలీ సేవలను ప్రకటించిన PAM
- September 02, 2021
కువైట్ సిటీ: కువైట్ వీసా ట్రాన్స్‌ఫర్స్‌ను మరింత సులువు చేసింది.ఇకపై వీసా సంబంధిత ట్రాన్సక్షన్స్‌ను ఆన్‌లైన్ ద్వారా చేసుకునే విధంగా ప్రత్యేక వేదికను తీసుకొచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంబంధాల విభాగంలోని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) ప్రత్యేక ప్రతినిధి అసీల్ అల్ మజ్యేద్ మీడియాతో మాట్లాడారు.యజమానాలు తమ ఉద్యోగులకు సంబంధించిన వీసా సంబంధిత ట్రాన్సక్షన్స్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.దీని కోసం ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు.యజమానులు తమ ఉద్యోగులకు కావాల్సిన వర్క్ పర్మిట్లను కూడా ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని చెప్పారు.
అలాగే వర్కర్లను ఒక సెక్టార్ నుంచి మరో సెక్టార్‌కు ఈ ప్లాట్‌ఫాం ద్వారా మార్చుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలియజేశారు.అంతేగాక వ్యాపారవేత్తలు తమ అధికారిక ఎలక్ట్రానిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా కొత్త ఫైల్‌ను తెరవడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపైనే అభ్యర్థించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.వ్యాపార యజమానులు తమ లావాదేవీలను పూర్తి చేయడానికి, వారికి సంబంధించిన ట్రాన్సక్షన్స్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడాన్ని మరింత సులభతరం చేయడం కోసమే ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







