వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు..
- September 02, 2021
ఏపీ: దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ చేరుకున్న ఆయన.. వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించారు.ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, వారి కుటుంబసభ్యులు, పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురైన సీఎం వైఎస్ జగన్.. “నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది.” అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







