మిడ్ 2022 నాటికి 250K ఔన్సుల గోల్డ్, సిల్వర్ ఉత్పత్తికి కసరత్తు

- September 03, 2021 , by Maagulf
మిడ్ 2022 నాటికి 250K ఔన్సుల గోల్డ్, సిల్వర్ ఉత్పత్తికి కసరత్తు

సౌదీ: 2022 మధ్య కాలం నాటికి రెండు మేజర్ గోల్డ్ మైన్స్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని సౌదీ అరేబియా లక్ష్యంగా నిర్దేశించుకుంది. మక్కా పరిధిలోని అల్ ఖుర్మా గవర్నరేట్‌ లోని మన్సౌరా& మసారా SR3.3 బిలియన్ల విలువైన గోల్డ్ ప్రాజెక్ట్ లో 250,000 ఔన్సుల గోల్డ్, సిల్వర్ ను ఉత్పత్తి చేసే కెపాసిటీ కలిగి ఉంది. ఈ మైన్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ కార్మికుల సంఖ్య 4,500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో స్థానికుల రేటు 20 శాతంగా ఉంది. అయితే..అపరేషన్ దశలో మాత్రం కార్మికుల సంఖ్య 900కి చేరుకుంటుందని, ఆ సమయానికి స్థానిక కార్మికుల రేటు 49 శాతంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే..గోల్డ్ మైనింగ్ లో అత్యాధునికత సాంకేతికతగా చెప్పుకునే ఆటోక్లేవ్ టెక్నాలజీని గోల్డ్ ప్రాసెస్ లో వినియోగిస్తున్నట్లు వివరించారు. 

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com