సౌదీయేషన్లో భాగంగా 2021లో స్థానికులకు 213,000 ఉద్యోగాలు

- September 08, 2021 , by Maagulf
సౌదీయేషన్లో భాగంగా 2021లో స్థానికులకు 213,000 ఉద్యోగాలు

 సౌదీ: తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా సౌదీయేషన్ ప్రోగ్రాం చేపట్టిన కింగ్డమ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా వర్కౌట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో సౌదీలకు 213,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి వెల్లడించారు. రిమోట్ వర్క్ ప్లాట్‌ఫామ్ ద్వారా 52,000 మందికి పైగా పౌరులు ప్రయోజనం పొందుతారని మంత్రి తెలిపారు. సౌదీయేషన్ ద్వారా ఇప్పటివరకు స్థానిక పౌరులకు 1.8 మిలియన్ ఉద్యోగాలను కల్పించినట్లు వివరించింది. ఇక 2024 నాటికి 3,40,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com