రవితేజ ఈడీ విచారణ ప్రారంభం…
- September 09, 2021
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈడీ ముందు హాజరయ్యాడు రవితేజ. డ్రైవర్ తో కలిసి తన బ్యాంకు డీటెయిల్స్ కు సంబంధించిన ఫైల్స్ తో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి సరైన సమయానికి ఈడీ ఆఫీస్ ముందు హాజరయ్యారు. తాజాగా ఈడీ రవితేజ విచారణను ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస కీలకం. ఎందుకంటే ఈ కేసు అతని పట్టుకోవడం ద్వారానే వెలుగులోకి వచ్చింది ఎక్సైజు శాఖ ఈ కేసులో ముందుగా శ్రీనివాస్ ని పట్టుకున్నారు. ఆ తరువాత అతని ద్వారా టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్ బయటపడ్డాయి.
శ్రీనివాస్ ద్వారా ఎక్సైజు ప్రత్యేక దర్యాప్తు బృందం కెల్విన్ ను పట్టుకుంది. ఇద్దరినీ విచారించగా నటీనటుల డ్రగ్స్ వాడకం బండారం మొత్తం బయట పెట్టేశారు. అలా డ్రగ్స్ లింక్స్ బయటపడడంతో సినిమా నటీనటులకు నోటీసిచ్చి ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసింది. ఈ కేసులో శ్రీనివాస్, కెల్విన్, ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ల బ్యాంకు లావాదేవీల కీలకంగా మారాయి. శ్రీనివాస్ ద్వారా టాలీవుడ్ కు డ్రగ్స్ సరఫరా అయినట్లుగా అధికారులు గుర్తించారు. తాజాగా విచారణకు హాజరైన రవితేజ, శ్రీనివాస్ బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన స్టేట్మెంట్ ను ఈడి అధికారులకు ఇచ్చారు. ఆ లావాదేవీలు, డ్రగ్స్ కు సంబంధించి ఈడీ అధికారుల విచారణ కొనసాగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







