దోహాలో కళ్యాణ్ జ్యుయెలర్స్‌ని ప్రారంభించనున్న అమితాబ్
- March 15, 2016
ఇండియా, జిసిసి దేశాల్లో ప్రముఖ జ్యుయెలరీ బ్రాండ్ అయిన కళ్యాణ్ జ్యుయెలర్స్, ఖతార్‌లోనూ తమ వ్యాపార కార్యకలాపాల్ని విస్తరించనుంది. దోహాలో ఒకే రోజు మొత్తం 7 షోరూంలను కళ్యాణ్ జ్యుయెలర్స్ ప్రారంభించనుంది. మార్చ్ 25న దోహాలో పలు షోరూమ్స్‌ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రారంభించనున్నారు. అమితాబ్‌తోపాటు కళ్యాణ్ జ్యుయెలర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటులు నాగార్జున, ప్రభు, మంజు వారియర్ తదితరులు ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. అమితాబ్ బచ్చన్‌కి స్వదేశంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లోనూ విపరీతమైన పాపులారిటీ ఉంది. దోహాలో అల్ వాటన్ సెంటర్ - హెచ్‌బికె సిగ్నల్, బర్వా విలేజ్‌లో బిల్డింగ్ నెం 12, షాప్ నెంబ 38, 39, అల్ రయాన్‌లో షాప్ నెంబర్ 14 అల్ షాఫి స్ట్రీట్, గరాఫాలో షాప్ నెంబర్ 11, లూలు హైపర్ మార్కెట్, అల్ ఖోర్‌లో షాప్ నెంబర్ 56, అల్ ఖోర్ మాల్, అబు హామర్‌లో - సఫారి మాల్, అసియన్ టౌన్‌లోని ప్లాజా మాల్‌లలో ఈ షోరూంలు ప్రారంభమవుతాయి. గల్ఫ్ దేశాల్లో ఇప్పటికే తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయనీ, రానున్న రోజుల్లో కళ్యాణ్ జ్యుయెలర్స్‌ని మరింత విస్తరింపజేస్తామని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







