ముంపు సమస్యపై యుద్ధప్రాతిపదికన అష్గల్ రెస్పాన్స్
- March 15, 2016
భారీ వర్షాలతో ఖతార్ కొద్ది రోజుల క్రితం అతలాకుతలమైంది. అయితే పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్, అద్భుతమైన రీతిలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మార్చ్ 7 నుంచి 9 వరకు భారీ వరానషలు కురిశాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వేర్వేరుగా టీమ్‌లను అష్గల్ నియమించింది. ఒక్కో టీమ్‌ని ఒక్కో చోటకు పంపించి, వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించింది అష్గల్. ఎమర్జన్సీ స్టాండ్ బై ఏర్పాటు చేయడం ద్వారా సకాలంలో స్పందించడానికి వీలయ్యిందని అష్గల్ అధికారులు చెప్పారు. దోహా, అల్ రయ్యాన్, ఉమ్ సలాల్ మున్సిపాలిటీల్లో నీటి ముంపు సమస్య ఎక్కువగా కన్పించింది. ప్రధాన రహదార్లు, టన్నెల్స్, డ్రైనేజ్ సిస్టమ్స్‌ని క్లియర్ చేసేందుకు మెరికెల్లాంటి సిబ్బందితోపాటు, తగిన యంత్రాలను, సాంకేతిక సహాయాన్ని ఉపయోగించామని అష్గల్ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







