దోహా రద్దీ రహదారిపై పులి సంచారం సంచలనం కల్గించిన వీడియో
- March 16, 2016
నిత్యం రద్దీగా ఉండే దోహా ఎక్స్ ప్రెస్ రహదారిపై , ఓ పెద్దపులి తాపిగా నడిచి వెళుతున్న వీడియో...సోషల్ మీడియా లో విపరీతమైన ప్రాచుర్యం కల్గించింది. అయితే , ఈ పులిని ఒక మలయాళ చిత్రం " మరుభూమి ఇలే ఆన " ( ఎడారిలో ఓ ఏనుగు ) లో నటింప చేసేందుకు స్థానికంగా అద్దెకు తీసుకొన్నారు. వి కె ప్రకాష్ దర్శకత్వంలో బిజూ మీనన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం పులిని దోహా తీసుకువెళుతున్నారు . పులిని హీరో బిజూ మీనన్ గొలుసుతో తిసుకువస్తున్నట్లు ప్రారంభపు సీన్ ను షూటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం పులిని 4x4 వాహనంలో రవాణా చేస్తున్న సమయములో, ఉమ్మ్ సలాల్ అనే ప్రాంతంలో పులిబోను ఉన్న వాహనం ఒక్కసారి కుదుపులకు గురై అకస్మాతుగా పులిబోనుకి వేసి ఉన్న తాళం తెరుచుకోవడంతో పులి పరారయ్యేందుకు బైటకు దూకింది. దోహా రహదారిపై పులి అటు ఇటు పరుగులు తీసింది. మరో వాహనంలో వెంబడిస్తున్న పులి శిక్షకులు పరిస్థితిని గ్రహించి గొలుసుతో సహా తక్షణమే ఆ పులిని నియంత్రణ చేశారు. ఇదే వార్తను సోమవారం మలయాళ మనోరమ దినపత్రిక ప్రచురించింది. అయితే సోషల్ మీడియాలో ఆదివారం దోహా రహదారిపై పులి నడిచి వెళుతున్న వీడియో క్లిప్పింగ్ పోస్టింగ్ తీవ్ర సంచలనం కల్గించింది. వారు పులి పట్టుబడటం మాత్రం చూపించలేదు. గంటల వ్యవధిలో జరిగిపోయిన ఈ తతంగం తెలియని " మరుభూమి ఇలే ఆన " చిత్రం యొక్క సిబ్బంది ఆదివారం సాయంత్రానికి షూటింగ్ ముగించుకొని సంతోషంగా హోటళ్లకు తిరుగుముఖం పడుతుండగా, అక్కడకు వచ్చిన ఒమాన్ ట్రాఫిక్ అధికారులు భారీ మొత్తంలో జరిమానా కట్టమని పులిని అద్దెకు ఇచ్చిన స్థానిక ఈవెంట్ మేనేజర్లకు నోటీసులు ఇవ్వడంతో అంతా విస్తుపోయారు. తాము కొన్ని నిమిషాల వ్యవధిలోనే పులిని నియంత్రించినట్లు వారు చెబుతున్నప్పటికీ అధికారులు పెద్ద జరిమానా వారితో కట్టించారు. " దోహా లో ప్రధాన రహదారుల మీద పులి సంచారం...సోషల్ మీడియాకు సంచలన వార్త కాగా చిత్రం యూనిట్ కు చేదు అనుభవం మిగిల్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







