ముడి బాదం,నానబెట్టిన బాదం వలన ప్రయోజనాలు
- September 12, 2021
బాదం శరీరానికి శక్తినిచ్చే పోషకాల మూలం. దీనిని పచ్చిగా తిన్నా, నానబెట్టి తిన్నా మీ ఇష్టం. అయితే, ఆరోగ్యం విషయానికి వస్తే, తప్పనిసరిగా నానబెట్టిన బాదం తినడమే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. బాదంను నానబెట్టడం వల్ల పై తొక్క సులభంగా వస్తుంది. నానబెట్టిన బాదంలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. బాదంలో విటమిన్ ఇ తో పాటు డైటరీ ఫైబర్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీన్‌లతో నిండి ఉంటుంది. వీటిలో ఉండే ప్రొటీన్ కారణంగా కొన్ని తిన్నా కడుపునిండిన భావన కలుగుతుంది. అదనపు ఆహారాన్ని తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడానికి , రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది.
నానబెట్టిన బాదం రుచిలో మాత్రమే కాకుండా, అవి శరీరానికి అందించే పోషకాల పరిమాణంలో కూడా విభిన్నంగా ఉంటాయి. ముడి బాదం గోధుమ చర్మంతో పొరలుగా ఉంటుంది, ఇందులో టానిన్ ఉంటుంది. ఇది పోషక శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల మరికొన్ని ప్రయోజనాలు..
- జీర్ణక్రియకు ఉపకరిస్తాయి.
- బాదం ఆరోగ్యకరమైన చిరుతిండి.. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
- చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- బాదంలో ఉండే విటమిన్ ఇ వృద్ధాప్య చాయలను దరి చేరనీయదు. శరీరంలో వాపును నిరోధించే యాంటీఆక్సిడెంట్లను విడుదల చేస్తుంది.
- నానబెట్టిన బాదంలో విటమిన్ బి 17 ఉంటుంది. ఇది క్యాన్సర్ రోగులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







