ఛారిటీ వర్క్ కోసం ఎహ్సాన్ కు SR10M విరాళం ఇచ్చిన యువరాజు

- September 12, 2021 , by Maagulf
ఛారిటీ వర్క్ కోసం ఎహ్సాన్ కు SR10M విరాళం ఇచ్చిన యువరాజు

రియాద్: సౌదీ యువరాజు, రక్షణ మంత్రి ముహమ్మద్ బిన్ సల్మాన్ తన ధాత్రృత్వాన్ని చాటుకున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కోసం "ఎహ్సాన్" జాతీయ వేదికకు ధార్మిక, లాభాపేక్షలేని పనుల నిర్వహణకు SR 10 మిలియన్లను విరాళంగా ఇచ్చారు. "ఎహ్సాన్" జాతీయ వేదిక ఇటీవల సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) ద్వారా విరాళాల నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పోర్టల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. క్రౌన్ ప్రిన్స్ విరాళంతో, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ఎహ్సాన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సేకరించిన విరాళం SR1 బిలియన్‌లకు చేరుకుందని,  SDAIA ప్రెసిడెంట్ అబ్దుల్లా బిన్ షరాఫ్ అల్-గమ్ది తెలిపారు. ఎహ్సాన్ జాతీయ వేదిక ధార్మిక కార్యక్రమాల కోసం క్రౌన్ ప్రిన్స్ అందించిన ఉదార విరాళాన్ని ఎంతో విలువైనదిగా ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com