సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ పై కేటీఆర్ సీరియస్
- September 12, 2021
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారి లైంగిక వేధింపులు, హత్య వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమన్న ఆయన, నేరస్తుడిని గంటల వ్యవధిలో అరెస్టు చేశారని తెలిపారు. చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డ కీచకుడికి కఠిన శిక్ష పడేలా చుడాలని హోమ్ మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.
కాగా, నిన్న హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల పాపపై ఓ దుర్మార్గుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా, సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది.
నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు రాజు అనే వ్యక్తి. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో రాజు దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులేకాదు, స్థానికులు కూడా గుండెలవిసేలా విలపించారు.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించారు. అయితే నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాగా, నిందితుడు రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ మందుకు బానిసై భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







