ECIL‌లో ఉద్యోగావకాశాలు..

- September 12, 2021 , by Maagulf
ECIL‌లో ఉద్యోగావకాశాలు..

హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ జూనియర్‌ ఆర్టిజన్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా ఎంపికైన అభ్యర్థులు మైసూరులో పని చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

  • నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 జూనియర్‌ ఆర్టిజన్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఫిట్టర్‌ ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా అసెంబ్లీ ఆఫ్‌ మెకానికల్‌, ప్రెసిషన్‌ మెకానికల్‌లో పని అనుభవం తప్పనిసరి.
  • అభ్యర్థులు 31-08-2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

  • అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,564 జీతంగా అందిస్తారు.
  • అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తులను ఈసీఐఎల్‌ జోనల్‌ ఆపీస్‌, ఎల్‌ఐసీ బిల్డింగ్‌, మల్లేశ్వరం, బెంగళూరు, 56003 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తుల స్వీకరణకు 17-09-2021గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
    http://www.ecil.co.in/
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com