సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్: మరింత మెరుగైన ఆరోగ్యం
- September 13, 2021
హైదరాబాద్: హీరో సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ ను ఆస్పత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. మెల్లి మెల్లిగా కోలుకున్నట్లుగా తెలిపారు. ఇది వరకుతో పోలిస్తే సాయి తేజ్ ఆరోగ్యం మరింత మెరుగైందని.. సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నిన్న ఆయన కాలర్ బోన్‌కు చేసిన ఆపరేషన్ విజయంతం అయ్యింది. ప్రస్తుతం ఆయన చికత్సకు స్పందిస్తున్నారు. మొదటిలో ఉన్న దానికంటే వెంటిలేటర్ అవసరం ఇప్పుడు తగ్గింది. ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
కాగా, శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలు అయిన విషయం తెలిసిందే. ఆయన్ను చూడ్డానికి సినీప్రముఖులు ఆస్పత్రికి వస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







