దుబాయ్ - అబుధాబి బస్ సర్వీస్ పునఃప్రారంభం

- September 13, 2021 , by Maagulf
దుబాయ్ - అబుధాబి బస్ సర్వీస్ పునఃప్రారంభం

దుబాయ్ మరియు అబుధాబి మధ్య నడిచే ఇ 101 బస్ షటిల్, తిరిగి ప్రారంభమయ్యిందని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈ ఇంటర్ సిటీ బస్, ఐబీఎన్ బట్టుటా బస్ స్టేషన్ (దుబాయ్) నుంచి బయల్దేరి అబుధాబిలోని సెంట్రల్ బస్ స్టేషన్ చేరుకుంటుంది. ఆర్టీయే ప్లానింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ డైరెక్టర్ అదెల్ షక్రి మాట్లాడుతూ, రెండు ఎమిరేట్స్ మధ్య ఈ రూట్‌లో పెద్దయెత్తున ప్రయాణీకులు ప్రయాణిస్తుంటారని తెలిపారు. అబుధాబి వెళ్ళే ప్రయాణీకులు కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వ్యాక్సినేషన్ పొందినవారు తమ గ్రీన్ స్టేటస్‌ని అల్ హోస్న్ యాప్ ద్వారా చూపించాలి. అలాగే ‘ఇ’ సైన్ లేదా స్టార్ సింబల్ (నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్) చూపించాల్సి వుంటుంది. వ్యాక్సిన్ పొందనివారు, కోవిడ్ 19 టెస్ట్ రిజల్ట్ (48 గంటల ముందు తీసుకున్న నెగెటివ్) ద్వారా ప్రయాణించవచ్చు. వరుసగా రెండుసార్లు ఎమిరేట్‌లోకి వెళ్ళేందుకు డిపిఐ టెస్ట్ రిజల్ట్స్ ఉపయోగించరాదు. వ్యాక్సిన్ పొందిన పౌరులు, నివాసితులు, విజిటర్స్ కోసం అబుధాబి ఇటీవలే నిబంధనల్ని సవరించిన విషయం విదితమే. వ్యాక్సిన్ పొందని విజిటర్స్, నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తీసుకురావాలి. అలాగే, వారికి నాలుగు మరియు 8 రోజులకు మరో మారు టెస్ట్ చేస్తారు. డిపిఐ టెస్ట్ రిజల్ట్ తీసుకువచ్చినవారికి మూడు మరియు ఏడు రోజుల్లో టెస్ట్ చేస్తారు. పలు పబ్లిక్ప ప్రాంతాల్లోనూ నిబంధనలు ఖచ్చితంగా అమలవుతాయి. వాటిల్లో వ్యాక్సిన్ పొందనివారికి ప్రవేశం లేదు. షాపింగ్ సెంటర్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లు అలాగే జిమ్‌లు, రిక్రియేషనల్ ఫెసిలిటీస్, స్పోర్టింగ్ యాక్టివిటీస్, హెల్త్ క్లబ్బులు, రిసార్టులు, మ్యూజియంలు, కల్చరల్ సెంటర్లు మరియు థీమ్ పార్కులు వీటిల్లో వున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com