వీర సూపర్ .. వీర సూపర్ అంటూ హల్ చల్ చేస్తున్న షారూఖ్..
- March 16, 2016
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్త్‌లోనే కాక సౌత్‌లోను ఈ హీరో అంటే పడిచచ్చే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇటీవల దిల్ వాలే చిత్రంతో అభిమానులను అలరించిన కింగ్ ఖాన్ ప్రస్తుతం ఫ్యాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో షారూఖ్ సూపర్ స్టార్ ఆర్యన్ ఖన్నాగా, అతని ఫ్యాన్ గౌరవ్‌గా రెండు పాత్రలు పోషిస్తున్నారు.తనకు అత్యంత ప్రియమైన ఫ్యాన్, అతి పెద్ద శత్రువుగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో ఫ్యాన్ మూవీ తెరకెక్కుతుంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి జబ్రా అనే థీమ్ సాంగ్‌ని విడుదల చేయగా, ఇప్పటికి ఆ పాటు జనాల నోళ్ళల్లో నానుతూనే ఉంది.ఈ పాటను అన్ని స్థానిక భాషలలోను విడుదల చేయాలని యూనిట్ అనుకుంది. దీంతో తెలుగులో వీర ఫ్యాన్ అంటూ ఓ సాంగ్‌ని విడుదల చేసారు. వీర సూపర్ .. వీర సూపర్ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం నెట్‌లో హల్ చల్ చేస్తుంది. ఈ పాటపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







