సోనమ్ బజ్వా తో వెంకటేష్ ఆడిపాడారు..
- March 16, 2016
వ చ్చీ రావడంతోనే బోలెడంత సందడిని సృష్టించడం మన కథానాయకుల శైలి. అందుకే సినిమాల్లో వాళ్ల పాత్రల్ని హోరెత్తిపోయే ఆటపాటల మధ్యే పరిచయం చేస్తుంటారు దర్శకులు. కథానాయకుడి పరిచయ గీతం... పేరుతో ప్రత్యేకంగా కసరత్తులు చేస్తుంటారు. అందుకోసం అందమైన భామల్ని కూడా రంగంలోకి దించుతుంటారు. తాజాగా వెంకీ కోసం ఓ ముద్దుగుమ్మ ఆడిపాడింది. మారుతి దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో కథానాయకుడి పరిచయ గీతాన్ని తెరకెక్కించారు.ఆ పాటలో సోనమ్ బజ్వా అనే కథానాయికతో వెంకటేష్ ఆడిపాడారు. కథానాయకుడిని కీర్తిస్తూ సాగే ఆ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ''వినోదానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. వెంకీ శైలి మాస్ అంశాలు కూడా ఇందులో ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నామ''ని తెలిపాయి చిత్రవర్గాలు. సంగీతం: జిబ్రాన్.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







