రాజు ఆత్మహత్య పై ట్వీట్ చేసిన కేటీఆర్
- September 16, 2021
సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజు ఆత్మహత్యకు సంబంధించిన సమాచారాన్ని తనకు డీజీపీ తెలిపినట్లుగా మంత్రి వివరించారు. హంతకుడి మృతదేహాన్ని రైల్వేట్రాక్‌పై గుర్తించినట్లుగా తనకు ట్వీట్ చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి రాజు సూసైడ్ చేసుకున్నట్లు లోకో పైలట్ పోలీసులకు తెలిపాడు. చేతి మీద వేయించుకున్న మౌనిక అనే పచ్చబొట్టు ద్వారా రాజుగా పోలీసులు గుర్తించారు.
Just been informed by @TelanganaDGP Garu that the beast who raped the child has been traced & found dead on a railway track at station Ghanpur#JusticeForChaithra https://t.co/TCx2BHvVhG
— KTR (@KTRTRS) September 16, 2021
ఈ మేరకు తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు. రైల్వే ట్రాక్‌పై దొరికిన మృతదేహంపై మౌనిక అని పచ్చబొట్టు ఉండటంతో నిందితుడు రాజు అని నిర్థారించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి గురువారం (సెప్టెంబర్ 9) చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లి నిందితుడు రాజు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







