యెమెన్‌లో 50 మంది రెబల్స్ హతం..
- September 16, 2021
అల్ బైదా: యెమెన్‌లో జరిగిన సైనిక కాల్పుల్లో 50 మంది రెబల్స్ మృతిచెందారు. అల్ బైదా సెంట్రల్ ప్రావిన్సులో ప్రభుత్వ దళాలు, రెబల్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఆ కాల్పుల్లో హై ర్యాంక్ ఆఫీసర్ ఒకరు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న రెబల్స్ దళంలోని 50 మంది వరకు మృతిచెందినట్లు మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. హౌతి రెబల్స్‌తో జరిగిన పోరులో ఓ కల్నల్‌తో పాటు 19 మంది హౌతి మద్దతుదారులు మరణించినట్లు ప్రభుత్వ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఘర్షణలు, వైమానిక దాడుల్లో మరో 30 మంది రెబల్స్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇరాన్ మద్దతు ఉన్న రెబల్స్ ఇటీవల అల్ బైదా ప్రావిన్సులో తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఉత్తర దిక్కున ఉన్న వ్యూహాత్మక మారిబ్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు రెబల్స్ ప్రయత్నించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







