టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం..
- September 16, 2021
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లను నిషేధిస్తూ టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అభ్యంతరకరమైన, ఆశ్లీల చిత్రాలు హైదరాబాద్ నగర బస్సులపై కనిపించవని ఆయన స్పష్టం చేశారు. ఓ సినిమాకు సంబంధించిన అశ్లీల పోస్టర్ ఆర్టీసీ బస్సుపై ఉండటాన్ని అభిరామ్ నేత అనే నెటిజన్ బుధవారం ట్విటర్‌లో పోస్టు చేశాడు. దీనికి టీఎస్‌ఆర్టీసీ ఎండీ ఆఫీస్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో సజ్జనార్ స్పందించారు.
సంస్థ దీనిపై చర్యలు తీసుకుంటుందని.. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లు కనిపించకుండా చర్యలు తీసుకుంటామని ఆయన రీట్వీట్ చేశారు. చెప్పినట్లుగానే ఆర్టీసీ బస్సులపై అసౌకర్యంగా, అభ్యంతరకరంగా ఉండే పోస్టర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. సజ్జనార్ చర్యపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







