మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్ లో ఘనంగా రోగి భద్రతా వారోత్సవాలు
- September 17, 2021
హైదరాబాద్: వరల్డ్ పేషేంట్ సేఫ్టీ డే సందర్బంగా రోగి భద్రతకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేసిన సిబ్బంది.సురక్షితమైన మరియు గౌరవప్రదమైన ప్రసవం కోసం ఇప్పుడే చర్య తీసుకోవాలని సూచించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉదేశ్యం.
ఈ సందర్భంగా మెడికవర్ ఉమెన్ &చైల్డ్ హాస్పిటల్స్ వారు గర్భిణీ స్త్రీలను , బాలింతలను , నవజాత శిశువులను ఉధ్యేశించి ఒక బుక్ లెట్ (సావనీర్ ) ని నీరజ్ లాల్ - వైస్ ప్రెసిడెంట్ మెడికవర్ హాస్పిటల్స్ మరియు బేబీ నైనికా వారిచే విడుదల చేసారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు , నవజాత శిశువు ని ఎలా సంరక్షించుకోవాలి ? , అను తదితర అంశాలను ఈ బుక్లెట్ లో పొందుపరిచారు. ఈ బుక్లెట్ ని మెడికవర్ హాస్పిటల్స్ వెబ్సైటు నందు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే ,HOD - నియోనాటాలజీ & పీడియాట్రిక్స్ గారు మాట్లాడుతూ దాదాపుగా ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 810 గర్భిణీలు , 6700 నవజాత శిశువులు అనేక కారణాల వల్ల మరణిస్తున్నారు. కోవిడ్ కారణంగా సరైన ఆసుపత్రులు, వైద్యసేవలు సరిగా లభించకపోవడంతో గర్భిణీలు అవస్థలు పడుతున్నారు.ప్రసవ సమయంలో మరణిస్తున్నారు . ఇటువంటి అవరోధాలను నిర్మూలించడానికి కొత్త తరహా వ్యూహాలు , టెక్నాలజీ కోసం పాటుపడాలని WHO వారు స్వచ్చంద సంస్థలను మరియు స్త్రీ ,శిశు వైద్య విధాన సంస్థలను కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నీరజ్ లాల్,డాక్టర్ రాకేష్ చీఫ్ మెడికల్ సర్వీసెస్ , డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే ,HOD - నియోనాటాలజీ & పీడియాట్రిక్స్,డాక్టర్ అశ్విని అన్నం - గైనకాలోజిస్ట్, డాక్టర్ వింధ్య - గైనకాలోజిస్ట్ , డాక్టర్ నవిత- పీడియాట్రిషన్ & నియనాటోలోజిస్ట్, సెంటర్ హెడ్ అనిల్ , ఆపరేషన్స్ హెడ్ సంగీత పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







