కోనేరు ప్రసాద్ రాజీనామా తో షాక్ తిన్న 'వైసీపీ'
- March 16, 2016
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు ప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయవాడలో పోటీ చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని, తమ రాజీనామాను ఆమోదించాల్సింగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖను బుధవారం ఆయన విడుదల చేశారు. ఇటీవలి కాలంలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, దీంతోపాటు ఉత్తరాంధ్రలో కోనేరు ప్రసాద్‌కు బీచ్ సాండ్ ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టుపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దానిపై శాసనసభలో ప్రశ్నోత్తర సమయంలో లేవనెత్తారు. దీనిపై వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కోనేరు రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







