'హను-మాన్' సినిమా నుంచి ఫస్ట్‌లుక్ విడుదల
- September 18, 2021హైదరాబాద్: విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ’హను మాన్‘. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు వీడియో శనివారం విడుదల చేశారు. ఈ సినిమాలో తేజ సజ్జూ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా అ!, కల్కి, జాంబీ రెడ్డి తదితర సినిమాలతో ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?