సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- March 31, 2026
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్‌షిప్) పథకం కింద జిల్లా స్థాయిలో నిర్వహించిన అవార్డుల్లో అర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ రెండో స్థాయి పి4 అవార్డును అందుకుంది. అనంతపురం జిల్లాలోని JNTU ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు ఈ సందర్భంగా అర్జాస్ స్టీల్ తరపున ఎక్స్‌టర్నల్ రిలేషన్స్ & సీఎస్ఆర్ విభాగాధిపతి నరేందర్ మిసా అవార్డును స్వీకరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పి4 పథకం ఏడాది క్రితం అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వంతో పాటు పరిశ్రమలు, సంస్థలు, ప్రజలు కలిసి సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి, సమాజ సంక్షేమం వంటి కీలక రంగాల్లో ఈ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తోంది.
ఈ పథకం కింద అర్జాస్ స్టీల్‌ను “మెంటర్”గా కూడా గుర్తించారు. సమాజ అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలుస్తూ అర్జాస్ సంస్థ అందిస్తున్న సహకారానికి ఈ గుర్తింపు లభించింది.
ఈ అవార్డు తమ సంస్థ సామాజిక బాధ్యత, సుస్థిర అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అర్జాస్ స్టీల్ ప్రతినిధి నరేందర్ మిసా తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిపాలనకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇదే దిశగా సేవలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్‌చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్‌కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







