ఏపీ కరోనా అప్డేట్
- September 19, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. కరోనా కేసులు తగ్గినట్టుగా తగ్గి తిరిగి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 1337 కరోనా కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,38,690కి చేరింది. ఇందులో 20,09,921 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 14,699 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,070కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, చిత్తూరులో 231, పశ్చిమ గోదావరిలో 198, గుంటూరులో 141, కృష్ణాలో 144, నెల్లూరులో 139, ప్రకాశంలో 161, పశ్చిమ గోదావరిలో 128 కేసులు నమోదయ్యాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







