నేడు రామానాయుడు 79వ జయంతి
- June 05, 2015
తెలుగువారి ఘనకీర్తిని దశదిశలా వెలిగేలా చేసిన అరుదైన వ్యక్తుల సరసన డి.రామానాయుడు స్థానం పదిలం... ఓ తెలుగు నిర్మాత హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించి, శతాధిక చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ లోనూ చోటు సంపాదించారు రామానాయుడు... 'సురేశ్ ప్రొడక్షన్స్' పతాకంపై ఆయన నిర్మించిన ఎన్నో చిత్రాలు తెలుగునేలను పులకింపచేశాయి... యన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'రాముడు-భీముడు' చిత్రంతోనే నిర్మాతగా రామానాయుడు జైత్రయాత్ర మొదలయింది... రామానాయుడు జైత్రయాత్రకు 'రాముడు-భీముడు' బీజం వేస్తే- ఆయనను విజయసారథిగా నిలిపిన చిత్రం 'ప్రేమనగర్'... ఏయన్నార్-వాణిశ్రీ జంటగా రూపొందిన 'ప్రేమనగర్' నవలా చిత్రాల్లో ఓ మణిపూసగా నిలచింది...యన్టీఆర్, ఏయన్నార్ తో చిత్రాలను నిర్మించి జనాన్ని అలరించిన రామానాయుడు కాంతారావుతోనూ కొన్ని జానపద చిత్రాలను నిర్మించారు... తరువాతి తరం హీరోలయిన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజుతోనూ ఆయన చిత్రాలను తెరకెక్కించారు... ముఖ్యంగా శోభన్ బాబుకు అరుదైన విజయాలను అందించిన ఘనత రామానాయుడిదే... తెలుగునాట పలు మల్టీస్టారర్స్ తెరకెక్కినా, అందులో స్వర్ణోత్సవ చిత్రంగా నిలచింది- రామానాయుడు నిర్మించిన 'ముందుడుగు' సినిమానే... శోభన్ బాబు, కృష్ణ హీరోలుగా రూపొందిన 'ముందడుగు' హైదరాబాద్ లో స్వర్ణోత్సవం జరుపుకుంది... తరువాతి తరం హీరోలతోనూ రామానాయుడు చిత్రాలను నిర్మించి జనాన్ని అలరించారు... తన ఫైట్స్ తో చిరంజీవి తెలుగువారిని సమ్మోహితులను చేస్తున్నతరుణంలో ఆయనతో రామానాయుడు 'సంఘర్షణ' నిర్మించారు... ఈ సినిమా మాస్ ను విశేషంగా ఆకట్టుకుంది... యన్టీఆర్ తో చిత్రాలు నిర్మిస్తూ జైత్రయాత్ర ఆరంభించిన రామానాయుడు, నటరత్న నటవారసుడు బాలకృష్ణతోనూ రెండు సిల్వర్ జూబ్లీ మూవీస్ తెరకెక్కించడం విశేషం... తండ్రీకొడుకులు ఇద్దరితోనూ సిల్వర్ జూబ్లీ హిట్స్ తీసిన ఘనత రామానాయుడిదే... తెలుగు టాప్ హీరోస్ అందరితోనూ చిత్రాలను నిర్మించి విజయాలను సాధించిన రామానాయుడు తన తనయుడు వెంకటేశ్ ను 'కలియుగపాండవులు' ద్వారా హీరోని చేశారు... వెంకటేశ్ తండ్రి అభిలాషను నెరవేరుస్తూ తనదైన అభినయంతో అలరించారు... పలువురు నటీనటులతో పాటు ఎంతో మంది టెక్నీషిన్స్ కి సినీ జన్మను ప్రసాదించారు రామానాయుడు... కారంచేడులో జిన్మించిన రామానాయుడు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం వెనుక ఆయన కృషి, దీక్ష, పట్టుదల ఉన్నాయి...ఎన్నో అవార్డులు, రివార్డులూ నాయుడు కీర్తి కిరీటంలో రత్నాలుగా వెలుగొందుతున్నాయి... అలుపు అన్నది ఎరుగకుండా గెలుపు కోసం శ్రమించిన రామానాయుడు భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచే ఉంటారు...
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







