వాన వెలిసింది

మాటలు
ఆవిరవుతూ  చేసే  నిశ్శబ్దం     

కనిపించని గాయాలతో                         
ఒకేసారి  ఇద్దరమూ  ఓడిపోతూ
ఓ యుద్ధం  ముగిసిపోయింది            

ప్రశ్నలన్నీ  నావే
ప్రతీ  ప్రశ్నకూ  జవాబు  నీ వద్దే
నీ  దగ్గర  ప్రశ్నలసలే లేనందుకు
నాకన్నా మిన్నగా  ప్రేమించబడ్డదెవ్వరు

వాన  వెలిసినందుకు
మట్టిలో  తీయని  వాసన

 

--పారువెల్ల  ||   

Back to Top