‘దిస్ ఈజ్ అవర్ టైమ్’ పేరుతో అధికారిక పాటను విడుదల చేసిన ఎక్స్పో 2020
- September 21, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 మరో పది రోజుల్లో ప్రారంభం కానుండగా, ‘దిస్ ఈజ్ అవర్ టైమ్’ పేరుతో ఎక్స్పో 2020 థీమ్ సాంగ్ విడుదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న వివిధ దేశాలు ఈ ఎక్స్పోలో భాగం పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అందర్నీ మమేకం చేసేలా ఈ పాటని రూపొందించారు. హుస్సేన్ అల్ జాస్మి (యూఏఈలో ప్రముఖ కళాకారుడు) ఈ పాటలో వున్నారు. ఆయన ఎక్స్పో 2020 బ్రాండ్ అంబాసిడర్ కూడా. లెబనీస్ అమెరికన్ గ్రామీ నామినేటెడ్ సింగర్ సాంగ్ రైటర్ మేస్సా కారా కూడా ఈ పాట కోసం పనిచేశారు. 21 ఏళ్ళ ఎమిరేటీ సింగర్, సాంగ్ రైటర్ అల్మాస్ కూడా ఈ పాట కోసం పని చేయడం జరిగింది. ఈ పాట చాలా ప్రత్యేకమైనదనీ, యూఏఈ ఖ్యాతిని మరింత పెంచేలా దీన్ని రూపొందించామని అల్ జాస్మి చెప్పారు. ఈ పాటలో భాగమైనందుకు ఆనందంగా వుందని అల్మాస్ అన్నారు. కారా మాట్లాడుతూ, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







