ఐసిస్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి
- March 16, 2016
ఐసిస్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా క్రూర జంతువుల్లా ప్రవరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా సిరియాకు చెందిన ఓ యువకుడు ఎక్కువగా మాట్లాడుతున్నాడని అతని నోరు కుట్టేసి వూరేగించారు. సిరియాలోని డెయిర్ ఎజ్జోర్ నగరంలో చోటు చేసుకుంది ఈ ఘటన. సిరియాకి చెందిన ఓ యువకుడు కుర్దిష్ ఉగ్రవాదులు ఈ నగరానికి వస్తున్నారని డెయిర్ ఎజ్జోర్లోని ఓ రెస్టారెంట్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. ఇది తెలుసుకున్న ఐసిస్ జిహాదీలు అతన్ని అదుపులోకి తీసుకుని నోటిని కుట్టి.. ఆ తర్వాత బంధించి నగరంలో వూరేగించారు.ఐసిస్ ఇలాంటి ఘటనలకు పాల్పడటం ఇది మొదటిసారి కాదు. ఐఎస్ ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు డెయిర్ ఎజ్జోర్ నగరానికి 70 కి.మీలు దూరంలో ఉన్న అబు కషబ్ గ్రామాల్లో కుర్దిష్, యాజిది బలగాలు ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో ఘటనలకు తెగబడ్డాయి.
తాజా వార్తలు
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష









