రీఎంట్రీ వీసాల‌ను ఫైన‌ల్ ఎగ్జిట్ వీసాగా మార్చ‌లేమ‌న్న సౌదీ

- September 22, 2021 , by Maagulf
రీఎంట్రీ వీసాల‌ను ఫైన‌ల్ ఎగ్జిట్ వీసాగా మార్చ‌లేమ‌న్న సౌదీ

 సౌదీ: ఎగ్జిట్ & రీ ఎంట్రీల‌పై స్వ‌దేశాల‌కు వెళ్లిన ప్ర‌వాసీయుల వీసాల‌ను ఫైన‌ల్ ఎగ్జిట్ వీసాలుగా స‌వ‌రించ‌టం కుద‌ర‌ద‌ని సౌదీ పాస్ పోర్ట్ డైరెక్ట‌రేట్- జ‌వాజ‌త్ స్ప‌ష్టం చేసింది. రీ ఎంట్రీ వీసాల‌పై కింగ్డ‌మ్ వెలుప‌ల ఉన్న ప్ర‌వాసీయులు అంతా త‌మ గ‌డువు లోప‌ల తిరిగి రావాల్సిందేన‌ని పేర్కొంది. సౌదీ గెజిట్ ప్ర‌కారం ఎగ్జిట్ & రీ ఎంట్రీ వీసాల‌పై కింగ్డ‌మ్ వ‌దిలివెళ్లిన ప్ర‌వాసీయులు గ‌డువు ముగిసేలోగా తిరిగి రాకుంటే మూడేళ్ల వ‌ర‌కు నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని జ‌వాజ‌త్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే..తమ పాత య‌జ‌మాని నుంచి మ‌ళ్లీ వీసా పొందింతే మాత్రం నిషేధం నుంచి మిన‌హాయింపు ఉంటుంది. అలాగే దేశం విడిచి వెళ్లిన రోజు నుంచే గడువు స‌మ‌యాన్ని లెక్క‌గ‌డ‌తారు. డొమ‌స్టిక్ వ‌ర్క‌ర్ల రీఎంట్రీ వీసా గ‌డువు ముగిస్తే వారిని ఆటోమెటిగ్గా జ‌వ‌జ‌త్ సిస్టం నుంచి ఆరు నెల‌ల పాటు తొల‌గిస్తారు. అయితే..త‌వ‌సుల్ ద్వారా ముంద‌స్తుగా విజ్ఞ‌ప్తి చేసుకుంటే మాత్రం 30 రోజ‌ల పాటు సిస్టం నుంచి తొల‌గిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com