రీఎంట్రీ వీసాలను ఫైనల్ ఎగ్జిట్ వీసాగా మార్చలేమన్న సౌదీ
- September 22, 2021
సౌదీ: ఎగ్జిట్ & రీ ఎంట్రీలపై స్వదేశాలకు వెళ్లిన ప్రవాసీయుల వీసాలను ఫైనల్ ఎగ్జిట్ వీసాలుగా సవరించటం కుదరదని సౌదీ పాస్ పోర్ట్ డైరెక్టరేట్- జవాజత్ స్పష్టం చేసింది. రీ ఎంట్రీ వీసాలపై కింగ్డమ్ వెలుపల ఉన్న ప్రవాసీయులు అంతా తమ గడువు లోపల తిరిగి రావాల్సిందేనని పేర్కొంది. సౌదీ గెజిట్ ప్రకారం ఎగ్జిట్ & రీ ఎంట్రీ వీసాలపై కింగ్డమ్ వదిలివెళ్లిన ప్రవాసీయులు గడువు ముగిసేలోగా తిరిగి రాకుంటే మూడేళ్ల వరకు నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుందని జవాజత్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే..తమ పాత యజమాని నుంచి మళ్లీ వీసా పొందింతే మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే దేశం విడిచి వెళ్లిన రోజు నుంచే గడువు సమయాన్ని లెక్కగడతారు. డొమస్టిక్ వర్కర్ల రీఎంట్రీ వీసా గడువు ముగిస్తే వారిని ఆటోమెటిగ్గా జవజత్ సిస్టం నుంచి ఆరు నెలల పాటు తొలగిస్తారు. అయితే..తవసుల్ ద్వారా ముందస్తుగా విజ్ఞప్తి చేసుకుంటే మాత్రం 30 రోజల పాటు సిస్టం నుంచి తొలగిస్తారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







