ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
- September 22, 2021
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 535 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 21న దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 12 చివరి తేదీ. డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పోస్టులో దరఖాస్తు ఫామ్ పంపాలి. వేర్వేరు రిఫైనరీలకు వేర్వేరు అడ్రస్‌లు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.
IOCL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు 535
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ప్రొడక్షన్) 296
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (పీ అండ్ యూ) 35
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఎలక్ట్రికల్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 65
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (మెకానికల్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 27
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఇన్స్ట్రుమెంటేషన్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 64
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ IV 29
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఫైర్ అండ్ సేఫ్టీ) 14
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV 4
జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ IV 1
IOCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 12
దివ్యాంగులు స్క్రైబ్ కోసం ప్రొఫార్మా సబ్మిట్ చేయడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 18
అప్లికేషన్ ప్రింట్ కాపీ, డాక్యుమెంట్ ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 23
రాతపరీక్ష- 2021 అక్టోబర్ 24
ఫలితాల విడుదల- 2021 నవంబర్ 11
విద్యార్హతలు- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ పాస్ కావాలి.
దరఖాస్తు ఫీజు- రూ.150.
వేతనం- రూ.1,05,000
IOCL Recruitment 2021: దరఖాస్తు విధానం
Step 1- అభ్యర్థులు ముందుగా https://iocl.com/latest-job-opening లింక్ ఓపెన్ చేయాలి.
Step 2- నాన్ ఎగ్జిక్యూటీవ్ పర్సనల్లో Click here to Apply Online పైన క్లిక్ చేయాలి.
Step 3- మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టును సెలెక్ట్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
Step 5- మీరు ఏ రిఫైనరీలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో సెలెక్ట్ చేయాలి.
Step 6- ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
Step 7- మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు చేయాలి.
Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
Step 9- అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
Step 10- అప్లికేషన్ ఫామ్‌పైన సంతకం చేసి, ఫోటో అతికించి, జిరాక్స్ కాపీస్ జత చేసి పోస్టులో పంపాలి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







