భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- September 23, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఐదు వేలకు పైగా కేసులు పెరిగాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 282 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 31,990 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,01,604 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. 187 రోజుల్లో ఇదే అతి తక్కువ.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య 3,28,15,731కు పెరగగా.. కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,46,050కు చేరింది.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,38,205 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 83,39,90,049 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







