కరెన్సీ డివాల్యూషన్ రూమర్స్‌ని ఖండించిన ఒమన్
- March 16, 2016
ఒమన్స్ సెంట్రల్ బ్యాంక్, రియాల్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోందనీ, ఫ్యూచర్స్ మార్కెట్లో కరెన్సీ వాల్యూని మార్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హమౌద్ బిన్ సంగౌర్ అల్ జద్జలి మాట్లాడుతూ, మార్కెట్లో కరెన్సీ డివాల్యూషన్ రూమర్స్‌ని ఖండించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరల సంక్షోభం కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు గల్ఫ్ కరెన్సీలతో ఒమన్ రియాల్ కరెన్సీ డివాల్యూషన్కి సిద్ధమవుతోందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. వీటిని అర్థంలేని విషయాలుగా ఖండించారాయన. లోకల్ బ్యాంకింగ్ సెక్టార్లో వడ్డీ రేట్లను తగ్గించడం జరుగుతోంది. 2014లో 5.080 నుంచి 2015 డిసెంబర్ నాటికి 4.762 వరకు తగ్గిందని వడ్డీరేట్లు తగ్గాయి. పర్సనల్ లోన్స్ ఇంట్రెస్ట్‌పై సీలింగ్‌ని పెంచే ఆలోచన లేదని సెంట్రల్ బ్యాంక్ చీఫ్ వెల్లడించారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంక్షోభ సమయాల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ప్రభుత్వం, బ్యాంకింగ్ సెక్టార్స్ తగిన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









