కరెన్సీ డివాల్యూషన్‌ రూమర్స్‌ని ఖండించిన ఒమన్‌

- March 16, 2016 , by Maagulf
కరెన్సీ డివాల్యూషన్‌ రూమర్స్‌ని ఖండించిన ఒమన్‌


ఒమన్స్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, రియాల్‌ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోందనీ, ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో కరెన్సీ వాల్యూని మార్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ హమౌద్‌ బిన్‌ సంగౌర్‌ అల్‌ జద్జలి మాట్లాడుతూ, మార్కెట్‌లో కరెన్సీ డివాల్యూషన్‌ రూమర్స్‌ని ఖండించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్‌ ధరల సంక్షోభం కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు గల్ఫ్‌ కరెన్సీలతో ఒమన్‌ రియాల్‌ కరెన్సీ డివాల్యూషన్‌కి సిద్ధమవుతోందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. వీటిని అర్థంలేని విషయాలుగా ఖండించారాయన. లోకల్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌లో వడ్డీ రేట్లను తగ్గించడం జరుగుతోంది. 2014లో 5.080 నుంచి 2015 డిసెంబర్‌ నాటికి 4.762 వరకు తగ్గిందని వడ్డీరేట్లు తగ్గాయి. పర్సనల్‌ లోన్స్‌ ఇంట్రెస్ట్‌పై సీలింగ్‌ని పెంచే ఆలోచన లేదని సెంట్రల్‌ బ్యాంక్‌ చీఫ్‌ వెల్లడించారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంక్షోభ సమయాల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ప్రభుత్వం, బ్యాంకింగ్‌ సెక్టార్స్‌ తగిన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com