’24’ సినిమా తమిళ ఆడియో కూడా హైద్రాబాద్‌లోనే.....

- March 17, 2016 , by Maagulf
’24’ సినిమా  తమిళ ఆడియో కూడా హైద్రాబాద్‌లోనే.....

తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా నటించిన ’24’ సినిమా ఈ సమ్మర్‌కు రానున్న భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. పోస్టర్స్, టీజర్స్ ఎవ్వరి ఊహకూ అందని స్థాయి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయిలో ఉన్నాయి. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’ లాంటి విలక్షణ సినిమాలతో మెప్పించిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన వినూత్న సినిమా కావడంతో ఈ సినిమాను సమ్మర్ సినిమాల్లో ఓ ప్రత్యేక సినిమాగానే చూడవచ్చు. మూవీ టీం కూడా సినిమాను అలాగే ప్రమోట్ చేస్తూ వస్తోంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈనెల 28న విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటే తమిళ ఆడియో ఆవిష్కరణ వేడుక కూడా అదే రోజున, హైద్రాబాద్‌లోనే జరగనుండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఏ.ఆర్.రెహమాన్ అందించిన ఆడియోలో ఇప్పటికే విడుదలైన ‘కాలం నా ప్రేయసివే’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. సూర్య స్వయంగా తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించారు. ఏప్రిల్ నెలాఖర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com