60 ఏళ్ళ తీర్మానానికి పార్లమెంటరీ తిరస్కరణ

- September 25, 2021 , by Maagulf
60 ఏళ్ళ తీర్మానానికి పార్లమెంటరీ తిరస్కరణ

కువైట్: 60 ఏళ్ళు పైబడినవారికి వర్క్ పర్మిట్లు రెన్యువల్ చేయకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఎంపీలు అద్నాన్ అబ్దెల్ సమాద్ మరియు హమాద్ అల్ మటర్‌లకు చుక్కెదురయ్యింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా చాలా మందిపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, మానవీయ కోణంలో పునరాలోచించాలని ఎంపీలు కోరారు. 2000 కువైటీ దినార్ల ఫీజు అదనంగా వేయడం అభ్యంతరకరమని ఎంపీలు అభిప్రాయపడ్డారు. కాగా, క్యాబినెట్ ఈ విషయమై పునరాలోచించాలని ఎంపీలు మళ్ళీ మళ్ళీ కోరుతూనే వున్నారు. ఈ నిర్ణయం ద్వారా కువైట్ మార్కెట్‌లో ప్రొఫెషనల్స్ కొరత ఏర్పడుతుందన్నది వారి వాదన. అల్ మటర్ మాట్లాడుతూ, బ్యాక్ అప్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒక్కటీ వేస్తే ఇబ్బంది వుండదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం తమను ఆశ్చర్యపరిచిందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com