బహ్రెయిన్ నుండి హైదరాబాద్ చేరుకున్న కార్మికులు
- September 29, 2021
హైదరాబాద్: పొట్ట చేత పట్టుకుని వలస కూలీలుగా మారి దేశం కాని దేశంలో ఇబ్బందులు పడుతూ ఉన్న కూలీలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ తీసుకున్నారు.
ఇటీవల బహ్రెయిన్ లో వలస కార్మికులకు జరుగుతున్న ఇబ్బందులు సోషల్ మీడియాలో, మీడియాల్లో కధనాలు వచ్చిన విషయం తెలిసిందే. వారి కష్టాలను సూచిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. అనంతరం బహ్రెయిన్ దేశంలో ఉన్న భారతీయ అంబాసిడర్ తో మాట్లాడి ఎన్.హెచ్.ఎస్ లో పని చేస్తున్న కార్ముకులను భారతదేశానికి పంపించే చర్యలు తీసులోవాలని తెలిపారు. ప్రస్తుతం బహ్రెయిన్ నుండి 20 మంది వలస కూలీలు హైదరాబాద్ చేరుకున్నారని విషయం తెలుసుకున్న రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కూలి పనుల కోసం వెల్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని తిరిగి క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో అభినందనీయమని తెలిపారు. కుటుంబాలను సైతం వది కాయ కష్టం చేయాలని ఆలోచనలతో దూర ప్రాంతాలకు వెలతారని కాని అక్కడ ప్రాణాలను సైతం పోగొట్టుకునే పరిస్థితులు ఎదురైనప్పుడు కార్మికుడు మానసిక క్షోభకు గురౌతాడని అన్నారు. అలాంటి సమయంలో వారు పడ్డ ఆవేదన చెందారు. బహ్రెయిన్ వలస కార్మికల కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారిని క్షేమంగా తీసుకు వస్తామని. ప్రస్తుతం మొదటి విడతగా 20 మంది కార్మికులు హైదరాబాద్ చేరారని వారి వారి స్వస్థలాలకు ప్రభుత్వం బాధ్యత వహించి చేర్పిస్తుందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







