భారత ప్రభుత్వానికి తాలిబన్లు లేఖ
- September 29, 2021
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యి నెల రోజులైంది.ఇప్పటి వరకు పాక్ మినహా ఏ దేశం కూడా అధికారికంగా ఆ దేశానికి విమానాలు నడపడం లేదు.దీంతో ఆ దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది.అంతర్జాతీయంగా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం గుర్తించలేదు.ఇక ఉదిలా ఉంటే, తాలిబన్లు మొదటిసారి భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖను రాశారు.అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన తరువాత ఖతర్ టెక్నాలజీని సపోర్ట్‌గా తీసుకొని ఎయిర్‌పోర్ట్‌ను రెడీ చేశామని, ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ప్రయాణాలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, తమ దేశానికి చెందిన రెండు అధికారిక విమాన సంస్థలైన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్, కామ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలను తిరిగి ప్రారంభించబోతున్నారని, వాణిజ్య విమానా రవాణాకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ తాలిబన్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







