జయప్రకాశ్ ను వరించిన గొల్లపూడి అవార్డు..!
- March 17, 2016
ప్రముఖ నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు కుమారుడు దివంగత గొల్లపూడి శ్రీనివాస్ పేరుమీద,.. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ప్రతి ఏట ఆగష్టు 12 న ,ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్ కి గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును ప్రదానం చేస్తుంది.ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని చెన్నైలో ఘనంగా నిర్వహించనున్నారు.గొల్లపూడి మారుతీ రావు కుమారుడు,గొల్లపూడి శ్రీనివాస్ ప్రేమ పుస్తకం అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ప్రమాద వశాత్తు మరణించారు.ఆయన ఙ్ఞాపకార్దం మారుతీరావుగారు దేశంలోని వివిద భాషల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్లకు గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.
గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ఇప్పటికి 1998 నుండి ప్రతి ఏటా ఈ అవార్డు ప్రదానం చేస్తూ వస్తుంది.ఇప్పటివరకు వివిధ భాషలకు చెందిన పద్దెనిమిదిమంది టాలెంటెడ్ డెబ్యూ డైరెక్టర్లకు ఈ ఫౌండేషన్ గొల్లపూడి శ్రీనివాస్ అవార్డును అందచేసింది.ఈ ఏడాది కూడా గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఆధ్వర్యంలో చెన్నైలో మ్యూజిక్ అకాడమీ హాలులో ఆగష్టు 12 న ఘనంగా ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనుంది.దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ వైజాగ్ లో జరిగింది.గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్...గొల్లపూడి శ్రీనివాస్ పేరుతో ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ నూతన దర్శకుడి నేషనల్ అవార్డును అందిస్తుంది. 2015వ సంవత్సరానికి గాను ఈ అవార్డ్ కు ఇంగ్లీష్ లో ది లెన్స్... అనే సినిమాను డైరెక్ట్ చేసిన జయప్రకాష్ ను ఎంపిక చేసినట్టు నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు ప్రెస్ మీట్ లో ప్రకటించారు. అవార్డు కింద లక్షా 50 వేల నగదును ఇస్తారు. తెలుగులో ఈ అవార్డులు 2006 ఏడాదిలో... గ్రహణం చిత్రానికి దర్శకత్వం వహించిన ఇంద్రగంటి మోహన్ కృష్ణకు, 2007లో వనజ సినిమా డైరెక్ట్ చేసిన రజనీష్ దోమలపల్లికి వచ్చాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







