వేద ఎంటర్‌ప్రైజస్ వారి కొత్త చిత్రం..!
- March 17, 2016
వేద ఎంటర్‌ప్రైజస్ ప్రొడక్షన్స్‌లో ఓ కొత్త చిత్రం నిర్మాణానికి సిద్ధమవుతోంది. శ్రీకర బాబు దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ నూతన చిత్రాన్ని దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు బార్బి, కారుణ్య చౌదరి, సాయాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో గురువారం ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 18 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. అమోఘ్ దేశపతి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నారు.

కథనం పూర్తిగా కామెడీ, హారర్‌గా కొనసాగుతుందని దర్శకుడు శ్రీకర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు డి. సురేశ్‌బాబు, అశోక్‌కుమార్, ప్రసన్నకుమార్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







