ఇండియా ఏవియేషన్‌ 2016లో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఎ350

- March 17, 2016 , by Maagulf
ఇండియా ఏవియేషన్‌ 2016లో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఎ350

ఇండియా ఏవియేషన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ మరియు కాన్ఫరెన్స్‌లో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఎ350 ను ప్రదర్శించింది. న్యూ జనరేషన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ అయిన ఎ350 మీడియం టు లాంగ్‌ హాల్‌ ఆపరేషన్స్‌ కోసం నిర్దేశించబడింది. ఇండియాలో ఇదే ఈ విమానానికి తొలి ప్రదర్శన. తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్‌ మరియు కాన్ఫరెన్స్‌ జరుగుతోంది. మార్చ్‌ 16 నుంచి 20 వరకు జరగనుంది ఈ ఎయిర్‌ షో. కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో హజరయ్యారు. ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఎ350 ఆపరేషన్స్‌ ఇటీవలే ఏడాది పూర్తిచేసుకున్నాయి. ప్రపంచంలోనే టెక్నలాజికల్లీ అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌గా ఎ350 పేరొందింది. ఫ్రాంక్‌ఫర్ట్‌, మ్యునిచ్‌, ఫిలడెల్ఫియా మరియు సింగపూర్‌లకు ఎ350 ప్రయాణిస్తోంది. అడిలైడ్‌, బోస్టన్‌ మరియు న్యూయార్క్‌లకు కొత్తగా విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ మొత్తం 8 ఎ350 విమానాల్ని నడుపుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com