సినిమా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగాలన్నీ స్థానికులకే

- October 03, 2021 , by Maagulf
సినిమా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగాలన్నీ స్థానికులకే

సౌదీ: సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్, సినిమా రంగంలో ఉద్యోగాలన్నీ స్థానికులే ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేసింది. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆప్ హ్యూమన్ రిసోర్స్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రియల్ ఏస్టేట్ ప్రధాన కార్యకలాపాల్లో ప్రొఫెషనల్స్ కు సంబంధించి 70 శాతం లోకలైజేషన్ చేశారు. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్, బ్రోకరేజ్, కన్ స్ట్రక్షన్ రంగంలో మాత్రం 100 ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని ప్రకటించారు. ఇక సినిమా ఫీల్డ్ కు సంబంధించిన అన్ని రంగాల్లోనూ వందశాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా ఆర్డర్ పాస్ చేశారు. ఈ నిర్ణయం కారణంగా కొత్తగా 11 వేల ఉద్యోగాలు రానున్నాయని మినిస్ట్రీ ఆప్ హ్యూమన్ రిసోర్స్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com